Wednesday, 20 November 2013
Monday, 7 October 2013
క్రొత్త నిబంధన పుస్తకములను ఎందుకు వ్రాయబడినవి?
క్రొత్త నిబంధన పుస్తకములను ఎందుకు వ్రాయబడినవి?
పాత నిబంధన లేఖనములు వాడుకలో ఉండగానే క్రొత్త నిబంధన పుస్తకములు ఎందుకు
వ్రాయబడినవి? అనే మీమాంస రావడం కద్దూ. దీనిపై స్పష్టత కొరకు పాత నిబంధన
లేఖనములు వ్రాయుటకు దారితీయబడిన కారణములను ఒక్కసారి పరిశీలిద్దాము.
భూమ్యాకాశముల సృష్టి మొదలుకొని మోషే కాలము వరకు భూతకాల చరిత్రను మోషే
గ్రంథస్థము చేయగా ఆ తరువాతి సంఘటనలు ఆయా కాలాలకు చెందినవారు గ్రంథస్థము
చేశారు. అలాగే వాగ్ధాన దేశమైన కనాను, బబులోను నాశనము, లోక రక్షకుడిగా యేసు
జన్మించడం తదితర భవిష్యత్తుకాల విషయములను ముందుగానే గ్రంథస్థము చేసినారు.
దీనిని బట్టి ఒక నిర్దేశిత మార్గంలో కొనసాగుతున్న చరిత్రలోని భూత, వర్తమాన,
భవిష్యత్తు కాలాలకు సంబంధించిన కీలక ఘట్టాలను పదిలం చేసి భవిష్యత్తు
తరాలకు అందించడమే లేఖనాల యొక్క ముఖ్యోద్దేశముగా కనిపించుచున్నది. పాత
నిబంధన లేఖనముల్లో ఎన్నో కీలక సంఘటనలను ప్రస్థావించినప్పటికీ వాటి గమ్యం
మాత్రము యేసు వద్దకు చేరునట్లు కనిపించును. అనగా పదిలం చేయబడుతున్న
చరిత్రలో యేసు చరిత్ర కూడా ఒక కీలక ఘట్టంగా తెలియుచున్నది. అందువలననే ఆయన
చరిత్రను, బోధనలను కూడా గ్రంథస్థము చేయడం జరిగినది.
సువార్త ప్రకటించడం కోసమే యేసు జీవిత చరిత్ర వాడుక
యేసు పునరుత్థానము జరిగిన తరువాత చాలా కాలము వరకు ఆయన జీవిత చరిత్ర మరియు
ఆయన బోధనలను రచించలేదు. అందుకు ప్రధాన కారణం, "మరియు-మీరు సర్వలోకమునకు
వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి" (మార్కు 16:15-16) అని యేసు
ఉద్బోదించడంతో సువార్తను ప్రకటించడమే తమ పూర్తిస్థాయి విధిగా ఆయన శిష్యులు
భావించారు. అందుకే యేసు జీవిత చరిత్రను, ఆయన బోధనలను, మరణము, పునరుత్థానము
గురించి ప్రచారం చేస్తూ సువార్తను ప్రకటించారు తప్పితే వాటిని గ్రంథస్థము
చేయలేదు. అందువలన యేసు జీవిత చరిత్ర చాలా కాలం పాటు మౌఖికంగానే కొనసాగాయి. ఆ
తరువాత సువార్తను ప్రకటించడం కోసం యేసు జీవిత చరిత్రను, ఆయన బోధనలు
గ్రంథస్థము చేయాలని అపొస్తలలు భావించియుండవచ్చును. అపొస్తలుల కార్యములు
2:41, 6:7 వాక్యములు పరిశీలించినట్లయితే సువార్త ప్రకటించడం కోసమే యేసు
జీవిత చరిత్ర, బోధనలు గ్రంథస్థము చేశారని, వాటిని అంగీకరించి పలువురు
బాప్తిస్మము పొందారని తెలియును. ఇలా వ్రాయబడిన సువార్తలతో పాటు పలు సంఘాలకు
వ్రాయబడిన పత్రికలు కూడా సంకలనము చేసి క్రొత్త నిబంధన గ్రంథముగా
కూర్చబడినది.
Wednesday, 21 August 2013
ప్రార్థన మెలుకువలు
ప్రార్థన మెలుకువలు
- మీరు ఏకాంత స్తలమును చేరి దేవుడు మీ ఎదుట ఉన్నాడని తలంచి, ఆయనకు నమస్కారము చేయండి.
- దేవుని ఎదుట మీ పాపములు ఒప్పుకొనండి. దేవా నా పాపములు క్షమించుము. నాకు తెలిసిన ఏ పోరాపటు/పాపములోను పడకుండా నన్ను కాపాడుము.
- దేవా! నా శక్తికొలది చెడును విసర్జింతును. నా తలంపులోకాని, చుపులోకాని, వినుటలోకాని, మాటలోకాని, ప్రయత్నములోకాని, క్రియలోకాని, ఏ దుర్బుద్ధి చేరకుండా ఉందును.
- దేవా! నా శరీమమును, నా ప్రాణమును, నా ఆత్మను, నా జ్ఞానమును, నా
మనసాక్షిని, నా ఇంటిని, నాకు కలిగియున్న సమస్తమును కాపుదల నిమిత్తమై నీ
వశము చేయుచున్నాను.
- సృస్తికర్తవైన దేవా! నీవు అది అంతము లేనివాడవు. అంతగొప్ప దేవుడవు
అయినప్పటికీ నీవు మా తండ్రివి మా ప్రార్థనలు విందువు. గనుక నీకు వందనములు.
నీవు జీవము గలవాడవు, ప్రేమ గలవాడవు, న్యాయము గలవాడవు, శక్తి గలవాడవు,
పాపము లేని పరిశుద్ధత గలవాడవు. నీవు అంతటా ఉన్నావు. నా దగ్గర కూడా ఉన్నావు. నీలో ఉన్న ఈ మంచి గుణములను మాలో కూడా పెట్టినావు గనుక నీకు వందనములు.
- దేవా! నాకు కలిగిన ఎన్నో కష్టములు తీసివేసినావు, గనుక నీకు వందనములు. నా కష్టములు తొలగించుట మాత్రమే గాక ఎన్నో ఉపకారములు చేసినావు, గనుక నీకు వందనములు. నేను నీకు ప్రార్థించినను, ప్రార్థించకపోయినను కాపాడినావు గనుక నీకు వందనములు.
- దేవా! ప్రభువా నేను నిన్ను కోరినను, కొరకపొయినను అనేక మేలులు చేసినావు గనుక నీకు వందనములు.
- దయగల తండ్రి! నాకు ఏవి అవసరమో అవి అనుగ్రహించుము. పోషణ ఆరోగ్యము అనుగ్రహించుము. (ఈ మెట్టులో మనకి ఏమి అవసరమో వాటి గురించి ప్రార్థించవలెను).
- దేవా! నీవే మా తండ్రివి, మా పోషకుడవు, మా వైద్యుడవు, మాకు విద్యాబుద్దులు నేర్పే దెవుడవు. మేము ఎల్లప్పుడును మీయందు భక్తి నిలుపగల శక్తిని అనుగ్రహింపగల సమర్థుడవు. మమ్మును మాత్రమే గాక నీవు కలుగజేసిన సమస్తమును దీవించుము. మనుష్యులందరిని రక్షించుము. నిన్ను నమ్మిన వారినందరిని మోక్షములోనికి చేర్చుకొనుము. నమ్మని వారికీ జ్ఞానము నేర్పుము, నమ్మిక కలిగించుము. వారిని కూడా మోక్షములోనికి చెర్చుకొనుము. (ఈ మెట్టులో మన తోటివారి కొరకు, సృష్టి అంతటి కొరకు ప్రార్థించవలెను).
- దేవా! నాకు మనుష్యరూపములో దర్శనములోగాని, స్వప్నములోగాని కనపదుము. నాతో మాట్లాడుము. నేను నిన్ను ఏమైనా అడిగిన యెడల జవాబు చెప్పుము.
- ఇప్పుడేమియు మాట్లాడకుండా నిశ్శబ్దముగా ఉండి దేవుడు మీకు ఏమి చెప్పునో వినుటకై కనిపెట్టండి. అప్పుడాయన నిశ్చయముగా కనబడి మీతో మాట్లాడును.

























